: కేరళ ముఖ్యమంత్రికి భావన లేఖ రాసిన మరుసటి రోజే... నా కుమారుడు మంచోడంటూ హీరో దిలీప్ తల్లి లేఖ!


కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు సినీ నటి భావన లేఖ రాసిన మరుసటి రోజే నటుడు దిలీప్ తల్లి సరోజం పిళ్లై కూడా లేఖ రాశారు. ఈ లేఖలో తన కుమారుడు అమాయకుడని తెలిపారు. తన కుమారుడు ఇలాంటి నేరానికి పాల్పడడని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. విచారణలో జోక్యం చేసుకుని తన కుమారుడ్ని కాపాడాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు. ఈ లేఖ అందినట్టు సీఎం కార్యాలయం నిర్ధారించింది. ఈ లేఖను కేరళ పోలీస్ చీఫ్ లోక్ నాథ్ బెహరాకు పంపినట్టు కార్యాలయం తెలిపింది.

 కాగా, అంతకు ముందు రోజే కేబినెట్ మంత్రి పీసీ జార్జ్ వ్యవహరిస్తున్న తీరు కేసు విశ్వసనీయతను ప్రశ్నించేలా ఉందని భావన ఫిర్యాదు చేస్తూ సీఎంకు లేఖ రాసింది. ఇదిలా ఉంచితే, భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో దిలీప్‌ ను అరెస్టు చేసి నెల రోజులు పూర్తయింది. అలువా-సబ్‌ జైలులో రిమాండులో ఉన్న దిలీప్ మూడు సార్లు బెయిల్ కు దరఖాస్తు చేయగా, ప్రతిసారి కేరళ హైకోర్టు అందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 18న జరగనుంది. 

  • Loading...

More Telugu News