: ఏ, బీ కేటగిరీల్లో మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటున్న హైదరాబాదు మెడికల్ మాఫియా
హైదరాబాదులో మెడికల్ మాఫియా వెలుగు చూసింది. హైదరాబాదులోని నీట్ ద్వారా సీటు సంపాదించలేని వారికి ఎరవేస్తున్న మెడికల్ మాఫియాను పోలీసులు పట్టుకున్నారు. పేరెంట్స్ తో మీటింగులు ఏర్పాటు చేసి, నామినల్ ఫీజుకే ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని ఎరవేస్తున్నారు. అడ్వాన్స్ గా 2 లక్షల రూపాయలు చెల్లించాలని, జాయిన్ అయ్యే ముందు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఒప్పందం చేసుకుంటున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వినోద్, శోభన్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, ఈ మాఫియా వెనుక ఎవరున్నారు? 25 లక్షల రూపాయలకు సీట్లు ఎలా ఇస్తారు? వంటి వివరాలను ఆరాతీయనున్నారు.