: ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం


టీడీపీ నుంచి వైసీపీలో ఇటీవల చేరిన ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి రాజీనామాను శాసన మండలి ఇన్ చార్జి చైర్మన్ గా వ్యవహరిస్తున్న డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆమోదించారు. చక్రపాణిరెడ్డి రాజీనామా లేఖను పంపిన పదిరోజుల్లోనే దీనిని ఆమోదించడం గమనార్హం. కాగా, టీడీపీని వీడి వైసీపీలో చేరాలనుకున్న చక్రపాణిరెడ్డిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తేనే తమ పార్టీలో చేరాలని జగన్ చెప్పడం తెలిసిందే. ఈ సూచనల మేరకు నాడు నంద్యాలలో జరిగిన వైసీపీ ప్లీనరీలో తన రాజీనామా పత్రాన్ని జగన్  చేతికి చక్రపాణిరెడ్డి అందజేశారు.

  • Loading...

More Telugu News