: చివరి రేస్ ముగించనందుకు ఏడుపొచ్చింది: ఉసేన్ బోల్ట్
చివరి రేస్ లో గాయపడి తన కెరీర్ ను పరుగుల రాజు ఉసేన్ బోల్ట్ విషాదకరంగా ముగించాడు. లండన్ లో 4x100 మీటర్ల రిలే ఫైనల్లో కండరాల గాయంతో బోల్ట్ కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ముగింపు వేడుకల సందర్భంగా ఏ ట్రాక్ పై అయితే కుప్పకూలిపోయాడో అదే ట్రాక్ పైకి నడిచి వచ్చిన బోల్ట్ కు అభిమానులు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోల్ట్ మాట్లాడుతూ, ‘నా ఫ్యాన్స్ కు, నా ఈవెంట్లకు.. అన్నింటికీ గుడ్ బై. నా చివరి రేస్ ముగించనందుకు ఏడుపొచ్చింది. ఇక ట్రాక్ పైకి నేను రాను’ అన్నాడు.