: తేజ గారు నాతో సిగిరెట్ కాల్పించారు!: హీరోయిన్ కేథరిన్
‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో తాను పోషించిన పాత్ర ద్వారా తనలోని నటి పూర్తిగా బయటకు వచ్చిందని హీరోయిన్ కేథరిన్ చెబుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్ తో సమానమైన పాత్ర తనదని చెప్పింది. తాను పోషించే పాత్ర ‘పవర్ ఫుల్’ అని అనుకుంటే, అది ఎంత చిన్నపాత్ర అయినా సరే, చేసేస్తానని కేథరిన్ చెప్పింది.
‘నేనే రాజు నేనే మంత్రి సినిమాలో ఆమె సిగిరెట్ తాగడం గురించి ప్రస్తావించగా.. ‘పాత్ర స్వభావం రీత్యా స్మోక్ చేయాల్సి వచ్చింది. నిజ జీవితంలో నాకు అలాంటి అలవాట్లు లేవు. ఈ సినిమా కోసం దర్శకుడు తేజ గారు నాతో సిగిరెట్ కాల్పించారు. ఈ సీన్ చేసే సమయంలో కొంచెం ఇబ్బంది పడ్డా’ అని కేథరిన్ చెప్పుకొచ్చింది.