: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం


భార‌తావ‌ని 71వ స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వారికి మ‌నం రుణ‌ప‌డి ఉన్నామని అన్నారు. వారి జీవితాల నుంచి మనం స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. ఎల్‌పీజీ గ్యాస్ స‌బ్సిడీని స్వ‌చ్ఛందంగా వ‌దులుకున్న కుటుంబాల‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్ర‌స్తుత కాలంలో ప్ర‌పంచ దేశాలు భార‌త్ వైపున‌కు చూస్తున్నాయ‌ని అన్నారు. దేశ పౌరులంతా బాధ్య‌త‌గా ప‌న్నులు స‌క్ర‌మంగా చెల్లిస్తే దేశాభివృద్ధికి బాట‌లు వేసిన‌వారు అవుతార‌ని ఆయన అన్నారు.

దేశంలో ఉన్న వివిధ ర‌కాల‌ ప‌న్నులను ఒకే గొడుగుకిందకు తెచ్చేందుకు, న‌గ‌దు బ‌దిలీల‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు ప్ర‌భుత్వం జీఎస్టీని అమ‌లులోకి తెచ్చింద‌ని రాష్ట్రపతి అన్నారు. పంటలు పండిస్తూ రైతులు త‌మ ప‌ని చేసుకోవ‌డ‌మే కాకుండా, త‌ద్వారా దేశానికి సేవ‌కూడా చేస్తున్నార‌ని కొనియాడారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కేంద్ర స‌ర్కారు స్వచ్ఛ భారత్‌ను చేపట్టిందని, ఇందులో ప్ర‌తి ఒక్క‌రు పాల్గొని ఆ నినాదాన్ని నిజం చేయాల‌ని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News