jawaan: 'జవాన్' రిలీజ్ వాయిదా పడినట్టే!
సాయిధరమ్ తేజ్ హీరోగా 'జవాన్' సినిమాను బీవీఎస్ రవి తెరకెక్కించాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే అదే రోజున బాలకృష్ణ - పూరి కాంబినేషన్లోని 'పైసా వసూల్' విడుదలవుతోంది.
ఈ నేపథ్యంలో 'జవాన్' విడుదల వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం వల్లనే నవంబర్ కి వెళుతున్నట్టుగా యూనిట్ నుంచి సమాచారం అందుతోంది. నవంబర్ 1న గానీ .. 8న గాని ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ సినిమా సక్సెస్ పై సాయిధరమ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశిస్తోన్న సక్సెస్ ఈ సినిమాతో లభిస్తుందేమో చూడాలి.