devisri prasad: 'అమ్మడూ లెట్స్ డు కుమ్ముడూ' పాట అలా రాశాను : దేవిశ్రీ


తాను సంగీతాన్ని అందించాలనుకునే సినిమాల కథలను తప్పకుండా వింటానని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. అలా పూర్తి కథను తెలుసుకున్నప్పుడే పాత్రల స్వరూప స్వభావాలు అర్థమవుతాయని అన్నారు. అలాంటప్పుడే సందర్భానికి తగినట్టుగా వచ్చే పాటలకు బాణీలను కట్టగలమనీ .. ఒక్కోసారి పాటను కూడా రాసే స్ఫూర్తిని పొందుతూ ఉంటానని చెప్పారు.

 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో 'అమ్మడూ లెట్స్ డు కుమ్ముడూ' అనే పాట తాను అలా రాసిందేనని అన్నారు. 'అమ్మడూ లెట్స్ డు కుమ్ముడూ' మాటను చిరంజీవి గారికి వినిపిస్తే .. ఆ మాటను అలాగే ఉంచి పాటను రాయించమని చెప్పారని అన్నారు. కొంతమందితో రాయించినా చిరూ సంతృప్తి చెందక తననే రాయమన్నారనీ, దాంతో తాను ఆ పాటను పూర్తి చేసి షూటింగుకి కొద్ది సేపు ముందు ఫైనల్ చేశానని చెప్పారు.    

devisri prasad
  • Loading...

More Telugu News