: ప్యాంటు జేబులో పేలిన రెడ్ మీ నోట్ ఫోర్...రావులపాలెం యువకుడికి గాయాలు


చైనా మొబైల్ సంస్థ షియోమీకి చెందిన రెడ్‌ మీ నోట్ 4 మొబైల్ పేలి యువకుడు గాయపడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకి చెందిన సూర్యకిరణ్ ఆన్ లైన్ లో రెడ్ మీ నోట్ 4 ఫోన్ ను కొనుగోలు చేశాడు. ఆదివారం ఉదయం పనిమీద బైక్ పై వెళ్తుండగా, అతని ప్యాంటు జేబులో ఉన్న రెడ్ మీ నోట్ 4 ఒక్కసారిగా పేలిపోయింది. జేబులోంచి మంటలు రావడంతో భయాందోళనకు గురైన సూర్యకిరణ్ బైక్ ను ఆపి ఫోన్ ను తీసే ప్రయత్నం చేయగా, ప్యాంటుకు అతుక్కుపోవడంతో బయటకు రాలేదు. ఇంతలో వేగంగా స్పందించిన స్థానికులు నీరు తెచ్చి మంటలు ఆర్పేశారు. ఫోన్ పేలడంతో అతని తొడకు గాయాలయ్యాయి. 

  • Loading...

More Telugu News