: ఢిల్లీలో మరో ఘోరం.... అత్యాచారం చేసి, నాలుగో అంతస్తు నుంచి తోసేశాడు!
అత్యాచారాల రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. 22 ఏళ్ల యువకుడు 20 ఏళ్ల యువతిని అత్యాచారం చేయబోయాడు. యువతి నిరాకరించడంతో ఆమెను నాలుగో అంతస్తు నుంచి తోసేశాడు. భవనం మీద నుంచి పడినపుడు ఆమె ఒంటిపై వస్త్రాలు సరిగా లేవని, భవనం లోపలి నుంచి ఒక వ్యక్తి పారిపోతుండటం చూసినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బాధితురాలు ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో అసిస్టెంట్ చెఫ్‌గా పనిచేస్తోంది. తన స్నేహితురాలు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె బయటికెళ్లింది. తిరిగి వచ్చేటపుడు నిందితుడితో కలిసి ఉన్నట్లు తనతో పాటు వెళ్లిన స్నేహితురాలు తెలియజేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, అతనిపై అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు.