: అంతా కల్పిత కట్టుకథ: సోనియా సంచలన నిర్ణయంపై ప్రియాంకా గాంధీ
కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనను నియమించాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నట్టు వచ్చిన వార్తలను ప్రియాంకాగాంధీ ఖండించారు. ఈ మేరకు ప్రియాంక పర్సనల్ అసిస్టెంట్ పి.సహాయ్, మీడియాతో మాట్లాడుతూ, ఈ వార్తలు కల్పితమని, వాస్తవం కాదని తేల్చి చెప్పారు. అటువంటి నిర్ణయమేదీ తీసుకోలేదని అన్నారు. కాగా, ఇటీవలి సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ బదులు ప్రియాంకను పార్టీకి అధ్యక్షురాలిగా చేయాలన్న తమ మనసులోని ఆలోచనను సీనియర్ల ముందు సోనియా బయటపెట్టారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.