: వాఘా సరిహద్దులో అతిఎత్తైన జాతీయ పతాకాన్ని ఎగరేసిన పాక్!
పాకిస్థాన్ 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వాఘా సరిహద్దులో పాక్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అధినేత ఖమర్ జావేద్ బాజ్వా అతిఎత్తైన జాతీయ పతాకాన్ని ఎగరేశారు. 400 అడుగుల ఎత్తున్న స్తంభంపై దీన్ని ఆవిష్కరించారు. పతాకం సైజు 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు. దక్షిణాసియాలో అతి ఎత్తైన పతాకంగా, అలాగే ప్రపంచంలోని ఎత్తైన పతాకాల్లో ఎనిమిదో స్థానంలో పాక్ జాతీయ పతాకం నిలిచింది. గతంలో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బీజేపీ నేత అనిల్ జోషి ఎగురవేసిన భారత జాతీయ పతాకం కంటే ఇది 40 అడుగుల ఎత్తు ఎక్కువగా ఉంది. అయితే, ఎగురవేసిన రెండ్రోజుల్లోనే తీవ్ర గాలిదుమారం కారణంగానే ఈ పతాకం కింద పడిన సంగతి తెలిసిందే.