: యాసిన్ యాతూను మట్టుబెట్టారు... నెక్ట్స్ టార్గెట్ రియాజ్ నైకూ... వల పన్నుతున్నారు!


కాశ్మీర్ లోని సోపియాన్ జిల్లాలోని ఓ గ్రామంలో రెండు రోజుల పాటు సాగిన ఎన్ కౌంటర్ లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆపరేషనల్ కమాండర్, జకీర్ మూసా వారసుడు యాసిన్ యాతూ అలియాన్ ఘజ్ నవీ మరణం తరువాత, సైనికుల నెక్ట్స్ టార్గెట్ గా మరో కీలక కమాండర్ రియాజ్ నైకూ నిలిచాడు. ఏడాది క్రితం బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తరువాత కీలక హిజ్బుల్ నేతలను వరుసగా మట్టు పెడుతూ వస్తున్న భారత సైన్యం, ఇప్పుడు రియాజ్ కోసం వల పన్నుతోంది.

కాగా, ఆగస్టు 12న యాసిన్ తో పాటు అతనికి సెక్యూరిటీగా ఉన్న ఉమర్ అనే మిలిటెంట్, ఇర్ఫాన్ అనే మరో మిలిటెంట్ ఓ గ్రామంలోకి వచ్చాడన్న సమాచారంతో భారీ ఎత్తున బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్న వేళ, జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న టాప్ మిలిటెంట్ ఖాసిమ్ ఫక్తూ, ఓ స్టేట్ మెంట్ విడుదల చేస్తూ, యాసిన్ మృతితో లోయలో తాము చేస్తున్న పోరాటానికి ఎంతో నష్టం చేకూరిందని అన్నాడు.

  • Loading...

More Telugu News