: సీఎంతో సమావేశానికి ముద్రగడను పిలవలేదు...ఆయన రారు: చినరాజప్ప
నేటి ఉదయం 11 గంటలకు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించనున్న కాపు సామాజిక వర్గ సమావేశంలో ముద్రగడ పద్మనాభం పాల్గొనడం లేదని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఈ సమావేశానికి ముద్రగడను ఆహ్వానించలేదని చెప్పారు. ఆయన తాబట్టిన కుందేలుకి మూడేకాళ్లు అనే రకమని, అందుకే ఆయనను పిలవలేదని అన్నారు.
అదే సమయంలో కాపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాపు జేఏసీ ప్రతినిధులను ఆహ్వానించామని ఆయన చెప్పారు. కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. రిజర్వేషన్లు వస్తాయని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. కాపులకు రిజర్వేషన్లు రావడం వల్ల బీసీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని, వారికి ఇప్పటికే రిజర్వేషన్లు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.