: రష్యా కమెండో ఆపరేషన్... 25 మంది జిహాదీల హతం!
ఐఎస్ఐఎస్ జిహాదీ ఉగ్రవాదులపై రష్యా విరుచుకుపడింది. సిరియా నుంచి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పూర్తిగా తరిమికొట్టేందుకు సంకీర్ణసేనలు నడుంబిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పట్టణాలను ఐఎస్ఐఎస్ నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా ఉగ్రవాదులు అక్కడక్కడ ప్రతిఘటిస్తున్నారు. ఈ క్రమంలో మధ్య సిరియాలో రష్యా యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల సాయంతో జరిగిన కమెండో ఆపరేషన్ లో 25 మంది ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్.)కు చెందిన జిహాదీ ఉగ్రవాదులను హతమార్చారు. సంకీర్ణ సేనల సహకారంతో హోమ్స్ స్టేట్ లో సిరియా సైనికులు ఈ దాడులు నిర్వహించారు. వారికి సాయంగా రష్యా రంగంలోకి దిగింది. ఈ దాడుల సందర్భంగా జరిగిన ప్రతిదాడుల్లో ఆరుగురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవడం విశేషం.
హోమ్స్ స్టేట్ లో సుమారు 90,000 చ.కి.మీ. విస్తీర్ణంలో బదియా ఎడారి ప్రాంతం విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని 2015లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. తిరిగి వాటిని స్వాధీనం చేసుకునేందుకు సంకీర్ణ సేనలు తీవ్రంగా పోరాడుతున్నాయి.