: సమంత ఇంటినిండా అవార్డులే.. ఇప్పుడు మరొకటి వచ్చింది: నాగచైతన్య


హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన సంతోషం సౌత్ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న న‌టుడు అక్కినేని నాగ‌చైత‌న్య.. ‘ప్రేమమ్‌’ చిత్రంలోని నటనకు గాను ‘ఉత్తమ నటుడి’ అవార్డు అందుకున్నాడు. ఇదే అవార్డుల్లో ఉత్తమ నటిగా ‘అ..ఆ’ చిత్రానికి గానూ సమంత ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా చైతూ మాట్లాడుతూ.. త‌న‌కు కాబోయే శ్రీమ‌తిని పొగిడేశాడు. సమంతకు ఇప్ప‌టికే ఎన్నో అవార్డులు వ‌చ్చాయ‌ని, ఇంటినిండా అవార్డులే ఉంటాయని అన్నాడు. ఇప్పుడు మ‌రో అవార్డు కూడా వ‌చ్చింద‌ని చెప్పాడు. త‌న‌కు ‘ప్రేమమ్‌’ చిత్రానికి గానూ అవార్డు రావ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. మలయాళం వెర్షన్‌ తనకు, ప్రేక్షకులకు ఎంతో స్ఫూర్తిగా నిలిచిందని చెప్పాడు. 

  • Loading...

More Telugu News