: రానాకు ఉపయోగపడలేకపోయానని నాకు నిజంగా బాధేసింది: నిర్మాత‌ సురేష్‌బాబు


త‌న కుమారుడు రానా సినిమాలలోకి రాకమునుపు గ్రాఫిక్ కంపెనీ పెట్టి బిజినెస్ రంగంలోని దిగాడని, ఆ త‌రువాత సినిమాల్లోకి వ‌స్తాన‌ని చెప్పాడ‌ని నిర్మాత సురేష్ బాబు అన్నారు. తన తండ్రికి రానాతో ఓ సినిమా తీయాల‌ని ఉండేద‌ని అది సాధ్యం కాలేద‌ని అన్నారు. త‌న‌కు నిజంగా ఓ విష‌యంలో బాధేసేద‌ని, రానా న‌టుడిగా నిల‌బ‌డ‌డానికి తాను ఇప్ప‌టివ‌ర‌కు ఏమీ చేయ‌లేక‌పోయాన‌ని అన్నారు.

చంటి సినిమా రైట్స్‌ని త‌మిళ ప‌రిశ్ర‌మ నుంచి కొనుక్కున్నామ‌ని, ఆ సినిమాను మొద‌ట వేరే హీరోతో తీయాల‌ని అనుకున్నామ‌ని సురేష్ బాబు చెప్పారు. అయితే, ఆ క‌థ చూసిన వెంక‌టేశ్ త‌న‌కే కావాల‌ని అన్నాడ‌ని చెప్పారు. ఆ త‌రువాత వెంక‌టేశ్‌తోనే ఆ సినిమా తీశామని, ఆ సినిమా అన్ని సినిమా రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టింద‌ని అన్నారు. తాను సినిమాల్లో న‌టించాల‌ని ఏనాడూ అనుకోలేద‌ని, ప‌లుసార్లు కొంద‌రు న‌టించ‌మ‌ని అడిగినా న‌టించ‌లేద‌ని చెప్పారు. త‌న‌కు యాక్టింగ్ చేయాల‌ని లేద‌ని అన్నారు. త‌న తండ్రిని చూసి తాను ఎన్నో నేర్చుకున్నాన‌ని అన్నారు. విజ‌యం వ‌చ్చిన‌ప్పుడు గ‌ర్వంతో త‌ల ఎత్త‌కూడ‌ద‌ని, ఓట‌మి ఎదురైతే ధైర్యంగా ఉండాల‌ని నేర్చుకున్నాన‌ని అన్నారు.

  • Loading...

More Telugu News