: భార్యాపిల్లల్ని కాపాడి... అగ్నికి ఆహుతైన భర్త!
తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో కారులో మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరుకు చెందిన బంగారం వ్యాపారి దిలీప్‌కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. మధుక్కరాయ్ ప్రాంతానికి ఆ కారు చేరుకునేసరికి కారు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన దిలీప్ కుమార్ కారులోని తన భార్యాపిల్లల్ని కిందకు నెట్టేశాడు. అనంతరం తాను కూడా దూకేద్దామని ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. తాను పెట్టుకున్న సీటు బెల్టు తీయడంలో ఆలస్యం కావడంతో భార్యాపిల్లల ముందే మంటల్లో కాలిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.