: హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ యాసిన్ యాతూను హతమార్చిన భారత ఆర్మీ
జమ్మూకశ్మీర్‌లోని షోపియన్‌లో కొన్ని గంటలపాటు భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ యాసిన్ యాతూ సహా ముగ్గురు ఉగ్రవాదులను భారత ఆర్మీ హతమార్చినట్లు తెలిసింది. భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్న సమయంలో ఉగ్రవాదులు కూడా కాల్పులు జరపడంతో ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.