: 135 పరుగులకే శ్రీలంక ఆలౌట్.. నాలుగు వికెట్లు తీసి శ్రీలంక బ్యాట్స్‌మెన్ వెన్నువిరిచిన కుల్‌దీప్ యాదవ్
శ్రీలంకలో జరుగుతున్న మూడవ వన్డేలో టీమిండియా ఆటగాళ్లు రాణిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 487 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చిందే ఆలస్యం అన్నట్లుగా ఒకరి తరువాత ఒకరు వెనువెంటనే అవుటయ్యారు. భారత బౌలర్ కుల్ దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి చెలరేగిపోయాడు.
దీంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో కేవలం 135 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 352 పరుగుల ఆధిక్యంలో ఉంది. శ్రీలంక బౌలర్లలో కరుణరత్నే 4, రణతుంగా 5, మెండిస్ 18, చండిమల్ 48, మ్యాథ్యూస్ 0, డిక్‌వెల్లా 29, పెరెలా 0, పుష్పకుమార 10, సందకన్ 10, ఫెర్నాండో 0, కుమారా 0 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ 4, షమీ 2, అశ్విన్ 2, పాండ్యా 1 వికెట్లు తీశారు.