: ఓటు హక్కు కోసం విదేశాల నుంచి 24,000 మంది దరఖాస్తు!
విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు ఓటు హక్కు కల్పించేందుకు మోదీ సర్కారు ఇచ్చిన అవకాశాన్ని ఇప్పటి వరకు సద్వినియోగం చేసుకున్న వారు కొద్ది మందే. 24,348 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువ మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ఓ ఆన్ లైన్ పోర్టల్ ను కూడా ప్రారంభించింది. దీంతో ఆన్ లైన్ లోనే సులువుగా నమోదు చేసుకుని ఓటు హక్కు పొందే అవకాశం కల్పించింది. ఇందులోనే వారి సందేహాలు తీర్చేందుకు వీలుగా ఎన్నో ప్రశ్నలు, వాటికి జవాబులను సైతం పొందుపరిచింది. వాస్తవానికి విదేశాల్లో ఉంటున్న వారిలో ఎంత మంది ఓటు హక్కుకు అర్హులన్న అంచనాలైతే లేవు. ఇక ఇప్పటికే వచ్చిన 24,348 దరఖాస్తుల్లో 23,556 ఒక్క కేరళీయులవే. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారి నుంచి 354, గుజరాత్ రాష్ట్రవాసులకు చెందిన 14 దరఖాస్తులున్నాయి.