: నా ఆస్తి అదే: వైసీపీ అధినేత జగన్


నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ ఐదో రోజు ప్రచారం ప్రారంభమైంది. స్థానిక శ్రీనివాస సెంటర్, వెంకప్ప అంగడి మీదుగా బాలాజీ కాంప్లెక్స్, పైప్ లైన్ రోడ్, సింగ్ కాలనీ, ఫరూక్ నగర్, చౌరస్తా వరకూ ఆయన రోడ్ షో కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ‘నాకు ఉన్న ఆస్తి నాన్న గారు ఇచ్చిన పెద్ద కుటుంబమే. వైఎస్ ఆర్ సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో బతికి ఉండటమే నా ఆస్తి.

మీ జగన్ అబద్ధం ఆడడు.. మోసం చేయడు.. మాట మీద నిలబడే విశ్వసనీయతే నా ఆస్తి. విలువలతో కూడిన రాజకీయాలే నా ఆస్తి. నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతా. ఒక్క అవకాశం ఇస్తే నాన్న మాదిరి అందరి గుండెల్లో ముద్ర వేసుకుంటా. బిల్డింగ్ లు కూల్చేయడం, రోడ్లు తవ్వడం అభివృద్ధి కాదు. రైతులు, పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే నిజమైన అభివృద్ధి. నంద్యాల ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటా’ అంటూ జగన్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News