: చైనా సరికొత్త ప్లాన్.. ఒక్క బులెట్ కూడా ప్రయోగించకుండానే భారత్‌పై నెగ్గే వ్యూహం!


డోక్లాం విషయంలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా పలు రకాలుగా భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేసింది. పరిమిత మిలటరీ ఆపరేషన్‌కు దిగబోతున్నట్టు అక్కడి అధికారిక పత్రికలు రోజుకో కథనాన్ని ప్రచురించాయి. అయితే భారత్‌ కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, యుద్ధానికి ఆ దేశం కూడా సిద్ధంగా ఉందన్న వార్తలు రావడంతో డ్రాగన్ కంట్రీ వెనక్కి తగ్గింది. ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది.

భారత్‌పై ఒక్క బులెట్ కూడా ప్రయోగించకుండానే విజయం సాధించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా ‘త్రీ వార్‌ఫేర్స్’ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. దీని గురించి పూర్తిగా వివరాలు వెల్లడికాలేదు. అయితే 2003లో చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ).. పీపుల్స్ లిబరేషన్స్ ఆర్మీ (పీఎల్‌ఏ)కి కొన్ని సూచనలు చేసింది. దీనినే ‘త్రీ వార్‌ఫేర్స్’ (శాన్ ఝోంగ్ ఝన్ఫా) గా వ్యవహరిస్తున్నారు.

2010లో దీనిని పబ్లిక్/ మీడియా వార్‌ఫేర్, ఫిజికల్ వార్‌ఫేర్, లీగల్ వార్‌ఫేర్‌గా అభివర్ణించారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా ఈ వ్యూహాత్మక విధానాన్ని అమలు చేసింది. ఇప్పడు భారత్‌పై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చైనా గతంలో ఫిలిప్పీన్స్‌పై ఈ త్రీ వార్‌ఫేర్స్‌ను ఉపయోగించింది. ఇప్పుడు డోక్లాం విషయంలో భారత్‌పై మీడియా వార్‌ఫేర్, ఫిజికల్ వార్‌ఫేర్, లీగల్ వార్‌ఫేర్ విధానాల ద్వారా విజయం సాధించాలని యోచిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News