: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి, మహిళా కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు


తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో పని చేస్తున్న ఎస్ఐ ఖలీల్ పాషా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపై ఖలీల్ పాషా, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్తోంది. అయితే, రోడ్డు పక్కన ఉన్న చెట్టును కారు ఢీ కొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, వరుసగా సెలవులు రావడంతో ఖలీల్ పాషా తన స్వస్థలానికి వెళుతుండగా ఈ విషాద సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News