: చివరి టెస్ట్: తొలిరోజు భారత్ 329/6


శ్రీలంకలోని పల్లెకలెలో జరుగుతున్న చివరి టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు 329/6 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా 13 పరుగులతో, హార్దిక్ పాండ్యా ఒక్క పరుగుతో క్రీజ్ లో ఉన్నారు. శిఖర్ ధావన్ సెంచరీ చేయగా, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మూడో సెషన్ లో కెప్టెన్ కోహ్లీ 42, చటేశ్వర్ పుజారా 8, రహానె 17, రవిచంద్రన్ అశ్విన్ 31 పరుగులు చేసి ఔటయ్యారు. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓ పెనర్లు శిఖర్ ధావన్ (119), రాహుల్ (85) శుభారంభం చేశారు. తొలి వికెట్ కు 188 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. కాగా, శ్రీలంక బౌలర్లు పుష్పకుమార్ 3, సందకన్ 2 వికెట్లు తీశారు.

  • Loading...

More Telugu News