: హైదరాబాద్ లో హుక్కా కేంద్రాలకు అనుమతి లేదు: సీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్ లో హుక్కా కేంద్రాలకు అనుమతి లేదని, ఇటువంటి వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హైదరాబాద్ నగర కమిషనర్ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోర్టు ఆదేశాల మేరకే హుక్కా సర్వీస్ పై నిషేధం విధించామని చెప్పారు. కోర్టులు సైతం హుక్కా సర్వీస్ లను నిషేధించాయని, అయితే, ఈ విషయంలో హుక్కా వ్యాపారులను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఎవరైనా ఈ వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని, ఎవరైనా హుక్కా సేవలను అందిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లదే బాధ్యత అని మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.