: రాజస్థాన్ యూనివర్శిటీల్లో ఈ ఏడాది గాంధీ జయంతి లేదు!


రాజస్థాన్ లో ఉన్న అన్ని ప్రభుత్వ యూనివర్శిటీల్లో ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉండదు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న యూనివర్శిటీ యథాతథంగా నడుస్తుంది. 2017-18 విద్యా సంవత్సరానికి గాను యూనివర్శిటీల ఛాన్సెలర్, గవర్నర్ కల్యాణ్ సింగ్ కార్యాలయం విడుదల చేసిన సెలవుల జాబితాలో గాంధీ జయంతిని చేర్చలేదు. అక్టోబర్ 1న మొహర్రం సందర్భంగా, అక్టోబర్ 13 నుంచి 21 వరకు దీపావళి సందర్భంగా సెలవులను ప్రకటించారు.

రామ్ దేవ్, గురునానక్ దేవ్, అంబేద్కర్ ల జయంతులు, మహావీర జయంతి, మహా రాణాప్రతాప్ జయంతిలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలోని 12 ప్రభుత్వ యూనివర్శిటీలు ఈ సెలవుల క్యాలెండర్ నే అనుసరించాలని గవర్నర్ పేరిట సర్య్కులర్ జారీ అయింది. రెండు నెలల క్రితమే ఈ జాబితాను యూనివర్శిటీలకు పంపించారు. ఇప్పటికే కొన్ని యూనివర్శిటీలు ఈ క్యాలెండర్ ను పాటిస్తుండగా... మిగిలిన యూనివర్శిటీలు అదే దారిలో నడవబోతున్నాయి.

  • Loading...

More Telugu News