: రోజాపై మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
టీడీపీ మంత్రి భూమా అఖిలప్రియ వస్త్రధారణపై విమర్శలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. రోజాలాంటి వారు వస్త్రధారణపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బట్టలు లేకుండా తిరిగే వాళ్లకు వస్త్రధారణపై మాట్లాడే అర్హత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిలప్రియపై రోజా ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నికలో ఓటుకు రూ. 5 వేలు పంచినా తమ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.