: నితీశ్ కుమార్ కు కీలక బాధ్యతలను ఆఫర్ చేసిన బీజేపీ!


యూపీఏకు గుడ్ బై చెప్పి, ఎన్డీయేతో జతకలసిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు కీలక బాధ్యతలను అప్పగించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఎన్డీయే కో-కన్వీనర్ బాధ్యతలను నితీశ్ కు అప్పగించేందుకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎన్డీయే కో-కన్వీనర్ బాధ్యతలను స్వీకరించాలని నితీశ్ ను అమిత్ షా కోరినట్టు... దీనికి నితీశ్ సమ్మతించినట్టు ఈ రోజు వార్తలు వెలువడ్డాయి.

నిన్న ఢిల్లీకి వచ్చిన నితీశ్... మోదీ, అమిత్ షాలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ చేరికపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో జేడీయూ ఎంపీలకు కొన్ని పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News