: ప్రపంచ ఆరోగ్యసంస్థ గుడ్‌విల్ అంబాసిడర్‌గా మిల్కా సింగ్
భారత అథ్లెట్ మిల్కా సింగ్‌ను ఫిజికల్ యాక్టివిటీ విభాగానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రపంచ ఆరోగ్యసంస్థ నియమించింది. దక్షిణ, తూర్పు ఆసియా ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఫిజికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించడానికే మిల్కా సింగ్‌ను అంబాసిడర్‌గా నియమించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డా. పూనమ్ కేత్రపాల్ సింగ్ తెలిపారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల హృద్రోగాలు, డయాబెటిస్, కేన్సర్ వంటి రోగాలను పారద్రోలవచ్చని ఆమె చెప్పారు. గుడ్‌విల్ అంబాసిడర్‌గా మిల్కా సింగ్ వ్యాయామ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారని, వీటి ద్వారా 2025లోగా డయాబెటిస్, హృద్రోగాల వల్ల చనిపోతున్న వారి సంఖ్యను 25 శాతానికి తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వివరించారు.