: కావడిపై ఇద్దరు మహిళలను మోస్తున్న విగ్రహం లభ్యం.. సింధు నాగరికతకు చెందినదిగా అంచనా!
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా ఉడుమలై సమీపంలోని వల్లకొండమ్మన్ ఆలయంలో ఓ పురాతన విగ్రహం లభించింది. 55 సెంటీమీటర్ల ఎత్తు, 40 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ విగ్రహం సింధు నాగరికత ముద్రణలో ఉన్నట్టే ఉంది. ఇద్దరు మహిళలను కావడిలో మోస్తున్న పురుషుడి విగ్రహమే ఇది. భుజంపై కండువా, బొడ్డులో కత్తి, ప్రత్యేక దుస్తులు, కుడి చేతిలో ఆయుధం ధరించిన విధంగా ఉన్న ఈ విగ్రహం సింధు నాగరికత ముద్రణలో ఉన్నట్టు ఉందని వీరరాజేంద్రన్ పురావస్తు, చరిత్ర పరిశోధన కేంద్ర డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ప్రాచీన కాలంలో ఒక చోట నుంచి మరొక చోటుకు వెళ్లేటప్పుడు వస్తువులను భుజంపై కావడిలో మోసుకెెళ్లడం ఆనవాయతీగా ఉండేదని ఆయన చెప్పారు. సింధు నాగరికత ప్రారంభం నుంచి నాయకుల కాలం వరకు దాదాపు 3 వేల సంవత్సరాల పాటు ఈ అలవాటు కొనసాగిందని తెలిపారు.