: మా ఆయన్ని ప్రతి ఏటా పెళ్లి చేసుకుంటాను: బిపాసా బసు
తన భర్తతో తనకున్న అనుబంధం ఎప్పటికీ పదిలంగా వుండడం కోసం ఆయనను ప్రతి ఏటా వివాహం చేసుకోవాలనిపిస్తోందని బాలీవుడ్ నటి బిపాసా బసు తెలిపింది. ‘ఎలోన్’ చిత్రీకరణ సమయంలో పరిచయమైన కరణ్ సింగ్ గ్రోవర్‌ను ఆమె 2016లో వివాహం చేసుకుంది. ముంబైలో జరిగిన ‘ది గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి బిపాసా ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా బిపాసా తన వివాహ వేడుకకు సంబంధించిన విషయాలను పంచుకుంది. తన పెళ్లి చాలా హడావుడిగా జరిగిందని, వీలైతే ప్రతి ఏటా తన భర్తని పెళ్లి చేసుకోవాలని ఉందని బిపాసా చెప్పుకొచ్చింది.