: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియాలో ఒకేఒక మార్పు!


విదేశాల్లో తొలిసారి టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచిన కోహ్లీ రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. మంచి బ్యాటింగ్ కండిషన్స్ ను ఉపయోగించుకోవాలనుకుంటున్నామని టాస్ గెలిచిన అనంతరం కోహ్లీ తెలిపాడు.

కాగా, టీమిండియా జట్టులో ఒక మార్పు జరిగింది. ఒక మ్యాచ్ నిషేధానికి గురైన జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమాల్ మాట్లాడుతూ, తాము కూడా మొదట బ్యాటింగ్ చేయాలనే అనుకున్నామని చెప్పాడు. శ్రీలంక జట్టులోకి లక్షణ్ సందకన్, లాహిరు కుమారా, విశ్వ ఫెర్నాండోలు వచ్చారు. గాయపడ్డ నువాన్ ప్రదీప్, ధనంజయ డీ సిల్వా, హెరాత్ లు జట్టుకు దూరమయ్యారు. కాసేపట్లో భారత్ బ్యాటింగ్ ప్రారంభంకానుంది. 

  • Loading...

More Telugu News