: జాతీయ సెన్సార్ బోర్డ్ చైర్మన్‌గా ప్రసూన్ జోషి... పహ్లాజ్ నిహలానీ ఔట్!
జాతీయ సెన్సార్ బోర్డ్ చైర్మన్‌గా బాలీవుడ్ గీత రచయిత ప్రసూన్ జోషిని నియమిస్తున్నట్లుగా కేంద్ర సమాచార ప్రసార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాలకు సర్టిఫికెట్ జారీ చేయడంలో పలు వివాదాలకు కారణమైన మాజీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీని తప్పించి ఆ స్థానంలో ప్రసూన్ జోషిని నియమించారు. అలాగే నటి విద్యాబాలన్‌కి కూడా ఈ కొత్తకమిటీలో చోటు దక్కింది. బ్లాక్, తారే జమీన్ పర్, భాగ్ మిల్కా భాగ్, రంగ్ దే బసంతి, నీర్జా చిత్రాలకు జోషి పాటలు రాశారు. పద్మశ్రీతో పాటు జాతీయ అవార్డు కూడా జోషి అందుకున్నారు. ఈయనను సీబీఎఫ్‌సీ చైర్మన్‌గా నియమించడంపై చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. జోషి నేతృత్వంలోని కమిటీలో విద్యాబాలన్‌తో పాటు ప్రముఖ నాటిది గౌతమీ తాడిమళ్ల, జీవితా రాజశేఖర్‌లు సభ్యులుగా ఉన్నారు.