: కిల్లర్ ఎలిఫెంట్ భరతం పట్టడానికి... రంగంలోకి దిగిన హైదరాబాద్ టాప్ హంటర్!


బీహార్ అడవులను దాటి, జార్ఖండ్ లో కాలు పెట్టి ఇప్పటివరకూ 15 మందిని హతమార్చిన ప్రాణాంతక ఏనుగును మట్టుబెట్టేందుకు హైదరాబాద్ కు చెందిన టాప్ షార్ప్ షూటర్ నవాబ్ సహాఫత్ అలీ ఖాన్ రంగంలోకి దిగారు. ఆయన నేతృత్వంలోని బృందం అడవుల్లోకి వెళ్లి ఈ కిల్లర్ ఎలిఫెంట్ ను హతమార్చనుంది. బీహార్ లో దీని బారిన పడి నలుగురు మరణించగా, జార్ఖండ్ లో 11 మంది మరణించారు.

ఏనుగును కాల్చి చంపాలని తీసుకున్న నిర్ణయంపై జార్ఖండ్ చీఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అధికారి ఎల్ఆర్ సింగ్ స్పందిస్తూ, దానికి మత్తివ్వాలని తాము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని తెలిపారు. అది ఉన్న ప్రాంతం దట్టమైన అడవుల్లో ఉందని, అక్కడ 15 అడుగులకన్నా ఎక్కువ దూరం చూసే పరిస్థితి లేకపోవడంతోనే, మానవ ప్రాణాలకు హాని కలిగిస్తున్న ఏనుగును చంపాలని నిర్ణయించామని తెలిపారు. గత రెండు రోజుల్లో నలుగురి ప్రాణాలను తీసినందున అటవీ శాఖ అధికారుల అనుమతితో సహాఫత్ అలీ ఖాన్ కు కబురు చేశామని అన్నారు.

  • Loading...

More Telugu News