: కాలరూస్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై ఉగ్రవాదుల దాడి... పలువురు సైనికులకు గాయాలు
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూ కశ్మీర్ సరిహద్దులకు దగ్గరగా ఉండే కాలరూస్ ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. అత్యాధునిక ఆయుధాలతో వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగా, పలువురు జవాన్లకు బులెట్ గాయాలు తగిలినట్టు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం ఉగ్రవాదుల దాడులను భారత సైన్యం తిప్పికొట్టే పనిలో ఉంది.
విషయాన్ని పై అధికారులకు తెలియజేయగా, కాలరూస్ కు అదనపు బలగాలను హుటాహుటిన తరలించారు. ఈ ఉగ్రవాదుల తాజా దాడిపై మరింత సమాచారం తెలియాల్సి వుంది. ఇదిలావుండగా, మెంధార్ సెక్టారులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మరోసారి ఉల్లంఘించింది. సరిహద్దు గ్రామాలు లక్ష్యంగా పాక్ తేలికపాటి మోర్టార్లతో విరుచుకుపడటంతో, ఓ మహిళ మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.