: ‘అల్ ఖైదా’ భారత్ వ్యవహారాల చీఫ్ ను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా భారత వ్యవహారాల చీఫ్ జకీర్ మూసాన్ ను భారత భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. జమ్మూకశ్మీర్ లోని నోర్ పూర్ ప్రాంతంలోని ట్రాల్ లో ఓ ఇంట్లో మూసా తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఇదిలా ఉండగా, మూసా స్వగ్రామం నోర్ పుర. ఈ గ్రామంలోని అల్లరిమూకలు రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించడం, నిరసనలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సెక్యూరిటీ అధికారులను అల్లరిమూకలు అడ్డుకున్నట్టు సమాచారం.