: సుప్రీంలో ‘అయోధ్య’ తుది విచారణ వాయిదా!


అయోధ్య వివాదంపై తుది విచారణ వాయిదా పడింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిన్ అబ్దుల్ నజీర్ తో కూడిన ధర్మాసనం ఈ కేసు తుది విచారణను డిసెంబర్ 5 నుంచి చేపడతామని పేర్కొంది. ఈ వివాదానికి సంబంధించి వేర్వేరు భాషల్లో ఉన్న చారిత్రక దస్త్రాలను ఇంగ్లీషులోకి అనువదించాలని కక్షిదారులకు ధర్మాసనం సూచించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను 12 వారాల్లోగా పూర్తి చేయాలని, అలహాబాద్ హైకోర్టు సమర్పించిన సాక్ష్యాల అనువాదాన్ని పది వారాల్లోగా పూర్తి చేయాలని యూపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

  • Loading...

More Telugu News