: రియల్టర్ హత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు యావజ్జీవం!


 సుమారు పదమూడేళ్ల కిందట ఓ రియల్టర్ హత్యకు సంబంధించిన కేసులో గుజరాత్ లోని గోండల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే జయరాజ్ సిన్హ్ జడేజాకు యావజ్జీవ శిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు .. 2004 లో గోండల్ లోని వారసత్వ సంపద విషయమై పటేల్, క్షత్రియ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఫిబ్రవరి 8న రియల్టర్ నీలేశ్ జీపులో వెళ్తుండగా అతడిపై ఎమ్మెల్యే జడేజా, మరి కొందరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.

దీంతో, జడేజా సహా 14 మందిపై హత్య కేసులు నమోదయ్యాయి. 2010లో ఎమ్మెల్యే జడేజా సహా 13 మందిని నిర్దోషులుగా రాజ్ కోట్ లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు నిచ్చింది. సమీర్ సిరాజ్ అనే మరో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో నాడు పిటిషన్ దాఖలైంది. ఈ కేసును విచారించిన హైకోర్టు ఎమ్మెల్యే జడేజా సహా, మరో ఇద్దరికి యావజ్జీవ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

  • Loading...

More Telugu News