: భర్త తాగుడు మానేయడంతో తిరిగి ఆయన వద్దకు వెళ్లాలనుకుంటున్న ఏంజిలినా జోలీ!
తన భర్త మద్యం తాగి పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడన్న కోపంతో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజిలినా జోలీ తన భర్త బ్రాడ్‌పిట్‌కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చేసి 11 నెలలు అవుతోంది. అయితే, తన భార్య, పిల్లలు దూరమవడంతో బ్రాడ్‌పిట్ కి బుద్ధి వచ్చింది. ఇప్పుడు తాగుడు పూర్తిగా మానేశాడు. తన భర్త తాగుడు జోలికి వెళ్లడం లేదని తెలుసుకున్న ఏంజిలినా జోలీ తిరిగి ఆయన వద్దకు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుందట. తన పిల్లల కోసమైనా ఆయన వద్దకు వెళతానని అంటోంది.