: ఇకపై గాంధీ ఆసుపత్రిలోనే నేను కూడా వైద్యం చేయించుకుంటా: గవర్నర్ నరసింహన్
ఇకపై గాంధీ ఆసుపత్రిలోనే తాను కూడా వైద్యం చేయించుకుంటానని గవర్నర్ నరసింహన్ అన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఐసీయూ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన 65 పడకలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. అనంతరం, నరసింహన్ మాట్లాడుతూ, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వం ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దిందని అన్నారు. ఈ సందర్భంగా, కొత్తగా ఏర్పాటు చేసిన పడకలను ఆయన పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను నరసింహన్ కు వైద్యాధికారులు వివరించారు.