: ‘రెడ్ మి నోట్ 4’ విక్రయాల్లో అరుదైన రికార్డు


'రెడ్ మి నోట్ 4' విక్రయాల్లో మరో రికార్డు సృష్టిచింది. 5 మిలియన్ రెడ్ మి నోట్ 4 మొబైల్స్ ను ఇప్పటివరకు విక్రయించినట్టు ఆ సంస్థ ప్రొడక్ట్ మేనేజర్ జై మని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన చేశారు. ఆరు నెలల కాలంలో రికార్డు స్థాయిలో ఈ ఫోన్ అమ్మకాలు నిర్వహించినట్టు చెప్పారు.

కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్ గా రెడ్ మి నోట్ 4 రికార్డు సృష్టించింది. 2 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.9999 కాగా, 3 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.10,999, 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ మెమురీ ఉన్న ఫోన్ ధర రూ.12,999గా ఉంది.

  • Loading...

More Telugu News