: చివరి టెస్టులో కుల్దీప్ కు చోటు దక్కవచ్చు: కోహ్లీ
ఇండియా-శ్రీలంకల మధ్య రేపటి నుంచి మూడోది, చివరిది అయిన టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగలడని... ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో కుల్దీప్ తనను తాను నిరూపించుకున్నాడని టీమిండియా కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. రేపు జరగనున్న మ్యాచ్ లో కుల్దీప్ ఆడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాడు. చివరి టెస్ట్ లో కూడా గెలిచి సీరీస్ ను క్లీన్ స్వీప్ చేయడానికి కోహ్లీ సేన పట్టుదలగా ఉంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇండియా ఇంతవరకు విదేశాల్లో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయలేదు.