: శరద్ యాదవ్ ఎక్కడికైనా వెళ్లొచ్చు.. ఆయనను ప్రసన్నం చేసుకోవడం పెద్ద కష్టం కాదు: నితీష్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, శరద్ యాదవ్ ల మధ్య అగాథం మరింత పెరిగింది. ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ శరద్ యాదవ్ కు ఉందని... ఆయనను ఎవరూ ఆపరని నితీష్ అన్నారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి ప్రమాణస్వీకారానికి ఢిల్లీ వెళ్లిన ఆయన, అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమకు దూరంగా వెళతానని చెబుతున్న శరద్ ను ప్రసన్నం చేసుకోవడం తనకు చాలా చిన్న విషయమని చెప్పారు. బీజేపీతో కలసి పని చేయాలనే నిర్ణయం పార్టీ తీసుకున్నదని... దాన్ని ప్రతిఒక్కరూ అంగీకరించాల్సిందేనని అన్నారు. ఈ రోజు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలతో నితీష్ కుమార్ భేటీ అయ్యారు. బీజేపీతో కలసిన తర్వాత వీరిని నితీష్ కలవడం ఇదే తొలిసారి.