: జగన్ ను భరించలేక ప్రశాత్ కిషోర్ ఢిల్లీ వెళ్లిపోయాడు: కేఈ
జగన్ వ్యక్తిత్వం ఏమిటో ప్రజలందరికీ తెలుసని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. తనకు పత్రిక, చానల్ లేదని జగన్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని... ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు ఎవరివో చెప్పాలని డిమాండ్ చేశారు. నంద్యాల ఉప ఎన్నిక రెఫరెండం కాదని... ఈ ఎన్నికను తాము సవాల్ గా తీసుకున్నామని చెప్పారు. జగన్ వ్యవహారశైలిని ఆ పార్టీలోని సీనియర్ నేతలే కాదు... ఆయన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా భరించలేక పోయాడని, అందుకే ఆయన ఢిల్లీ వెళ్లిపోయాడని ఎద్దేవా చేశారు. జగన్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే, ఎన్నికలంటే ఆయనకు గౌరవం లేనట్టు కనిపిస్తోందని అన్నారు.