: వివాదాలు, సంచలనాలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వకూడదు: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు


రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఉప రాష్ట్ర‌ప‌తి వెంకయ్యనాయుడు స‌భ‌లో తొలి ప్ర‌సంగం చేశారు. సభలో అన్ని పార్టీల సభ్యులు తనకు సమానమేనని ఆయ‌న అన్నారు. రాజ్య‌స‌భ‌లో అందుబాటులో ఉన్న సమయం ఆధారంగా అన్ని పార్టీల స‌భ్యుల‌కు మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పారు. రాజ్య‌స‌భ‌లో విలువైన స‌మ‌యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ‌లో జ‌రిగే చ‌ర్చ‌ల్లోని అంశాలను మీడియా చూపిస్తోన్న తీరుపై వెంక‌య్య నాయుడు విమ‌ర్శ చేశారు. స‌భ‌లో నిర్మాణాత్మకంగా జరిగే చర్చలను మీడియా ప్రసారం చేయాలని అన్నారు. మీడియా అలా చేయ‌కుండా స‌భ‌లో చెల‌రేగే వివాదాలు, సంచలనాలకు ప్రాధాన్యం ఇచ్చి చూప‌డం స‌రికాద‌న్నారు.    

  • Loading...

More Telugu News