: 85 ఏళ్లలో సాధించలేని రికార్డుపై కన్నేసిన టీమిండియా!
శ్రీలంక పర్యటనలో ఉన్న కోహ్లీ సేన మాంచి ఊపు మీద ఉంది. తొలి టెస్టులో భారత్ 304 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రేపు ప్రారంభం కానున్న మూడో టెస్టులో కూడా గెలిచి, టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. 85 ఏళ్ల టెస్టు ప్రయాణంలో విదేశీ గడ్డపై భారత్ ఇంత వరకు ఒక్కసారి కూడా క్లీన్ స్వీప్ చేయలేదు. ఇప్పుడు ఆ రికార్డును కైవసం చేసుకోవాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది.