: అమెరికా, ఉత్తర కొరియాల మధ్య యుద్ధం వస్తే మేం అమెరికా సైడే వుంటాం!: ఆస్ట్రేలియా
అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తార స్థాయికి చేరాయి. యుద్ధం వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని రక్షణ రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా మిత్ర దేశం ఆస్ట్రేలియా కీలక ప్రకటన చేసింది. ఒకవేళ యుద్ధమే వస్తే, తాము అమెరికావైపే నిలుస్తామని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్ బుల్ స్పష్టం చేశారు. యూఎస్ కే తమ మద్దతు అంటూ ప్రకటించారు.
1951 ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా ఒప్పందం ప్రకారం తాము అమెరికాకే అండగా నిలవాల్సి ఉంటుందని... ఒకవేళ తమపై దాడి జరిగితే అమెరికా తమకు సహకారం అందించాల్సి ఉంటుందని ఆసీస్ ప్రధాని తెలిపారు. ఇదే విషయంపై అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తో మాట్లాడినట్టు మీడియాకు ఆయన తెలిపారు. పసిఫిక్ మహా సముద్రంలో అమెరికాకు చెందిన గువామ్ ద్వీపంపై దాడి చేస్తామని ఉత్తర కొరియా ప్రకటించిన తర్వాత... పరిస్థితులు మరింత దిగజారాయి.