: కొండచిలువను చంపేశారు.. కానీ, మేకను మాత్రం బతికించలేకపోయారు!


మేకను కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం కమ్మలవాండ్లపల్లి సమీపంలో గల ఓ గుట్టపై నిన్న మధ్యాహ్నం ఓ మేకను కొండచిలువ మింగేసింది. కమ్మవాండ్లపల్లికి చెందిన జయప్ప కుమార్తె మాధవి గొర్రెలు, మేకలను మేపడానికి గుట్టపైకి వెళ్లింది. ఆ సమయంలో మేకను కొండచిలువ మింగుతుండగా చూసిన ఆమె, కేకలు పెట్టింది. ఆ పక్కనే రాళ్లు కొడుతున్న వడ్డెర్లు ఆమె కేకలు విని, వెంటనే అక్కడకు వచ్చారు. అప్పటికే మేకను కొండచిలువ పూర్తిగా మింగేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారు కొండచిలువను చంపి, మేకను బయటకు తీశారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. అప్పటికే మేక ప్రాణాలను కోల్పోయింది.

  • Loading...

More Telugu News