: గొడుగు పట్టుకుని రైలు నడుపుతున్న డ్రైవర్... వైరల్‌గా మారిన వీడియో చూడండి!
వర్షాకాలం వచ్చిందంటే దేశంలో ఉన్న అన్ని రకాల సమస్యలు బయటికొస్తాయి. పాఠశాల పైకప్పు పాడైపోవడం, ప్రభుత్వ కార్యాలయాల పైకప్పు బాగోలేకపోవడం ఇలాంటి సమస్యలు వార్తా పత్రికల్లో కనిపిస్తుంటాయి. కానీ రైలు పైకప్పు బాగోలేకపోవడంతో గొడుగు పెట్టుకుని రైలు నడుపుతున్న డ్రైవర్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ రైల్వేలో పనిచేస్తున్న డ్రైవర్ దుస్థితి ఇది. గొడుగు పట్టుకుంటున్నది తన కోసం కాదని, రైలును నియంత్రించే కంట్రోల్ పానెల్ తడవడకుండా ఉండటం కోసమని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితి వస్తుంటుందని, దీని గురించి ఫిర్యాదు చేసినా తన పై అధికారులు పట్టించుకోకపోవడంతో గొడుగు సహాయంతో నెట్టుకొస్తున్నానని ఆయన వివరించారు. ఈయన పరిస్థితిని వీడియో తీసి ఓ మహిళ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ రైల్వే మంత్రి సురేశ్ ప్రభును ట్యాగ్ చేసింది.